బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ ఎపిక్ డిసాస్టర్ ను సొంతం చేసుకున్నా కూడా ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) ఎక్స్ లెంట్ జోరుని చూపెడుతూ దూసుకు పోతుంది ఇప్పుడు…
4 రోజుల్లోనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 84.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా వరల్డ్ వైడ్ గా సినిమా 110 కోట్ల ఊచకోత కోసింది. ఇక సినిమా 5వ రోజున శనివారం వీకెండ్ అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్లా మాస్ రచ్చ చేసింది…
తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ఓవర్సీస్ అని లెక్క లేకుండా అన్ని చోట్లా మాస్ హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 18 కోట్లకు పైగా గ్రాస్ ను 5వ రోజున సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే…
గ్రాస్ ఇంకా పెరిగే అవకాశం ఉండగా…ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22-23 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మరోసారి సొంతం చేసుకునే అవాకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…ఫైనల్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు…ఇక ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల మార్క్ ని దాటేసి 103 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 130-132 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది..
ఫాస్టెస్ట్ కలెక్షన్స్ తో వెంకటేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా ఊపు చూస్తుంటే ఈ నెల ఎండ్ వరకు కూడా ఇదే జోరుని కొనసాగించే అవకాశం ఎంతైనా ఉంది…ఇక టోటల్ గా సినిమా 5 రోజుల్లో సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు….