Home న్యూస్ 132 గంటల మాస్ రచ్చ….బాలయ్య న్యూ టాలీవుడ్ రికార్డ్!!

132 గంటల మాస్ రచ్చ….బాలయ్య న్యూ టాలీవుడ్ రికార్డ్!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ2-తాండవం(Akhanda2 THANDAAVAM Movie) సినిమా మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు సెప్టెంబర్లో భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా…

బాలయ్య పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయగా టీసర్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది…ఇక టీసర్ మొదటి 24 గంటల్లో ఆల్ టైం రికార్డులను టాలీవుడ్ సీనియర్ హీరోలలో సొంతం చేసుకోగా తర్వాత కూడా మాస్ రచ్చ చేసిన ఈ టీసర్ యూట్యూబ్ లో…

నాన్ స్టాప్ గా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ మాస్ రచ్చ చేయగా కంటిన్యూగా ఎక్కువ గంటల పాటు టాప్ లో ట్రెండ్ అయ్యి టాలీవుడ్ సీనియర్ హీరోల పరంగా ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను సొంతం చేసుకోవడమే కాదు అలాగే టీసర్ టాప్ ట్రెండ్స్ ను ఎక్కువ సేపు సొంతం చేసుకున్న…

సినిమాలలో టాప్ 5 లో ఒకటిగా చేరి సంచలనం సృష్టించింది ఈ సినిమా…మొత్తం మీద ఈ టీసర్ యూట్యూబ్ లో మొత్తం మీద ఐదున్నర రోజుల పాటు ట్రెండ్ అయ్యి సంచలనం సృష్టించింది. అంటే ఆల్ మోస్ట్ 132 గంటల పాటు సినిమా టీసర్ యూట్యూబ్ లో…

టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యి సంచలనం సృష్టించగా టాలీవుడ్ లో సీనియర్ హీరోల సినిమాల పరంగా అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేసిన ఈ టీసర్ సినిమా మీద ఆడియన్స్ లో ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో చెప్పకనే చెప్పింది. ఇక బాలయ్య ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ఊచకోత కోస్తాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here