అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి వరుస విజయాల తర్వాత నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన డాకు మహారాజ్(Daaku Maharaj Movie) ఈ ఇయర్ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అందుకున్నా కూడా సంక్రాంతికి వస్తున్నాం ఎపిక్ రన్ వలన…
అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించలేదు. అదే సోలో గా వేరే టైం లో రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా బాలయ్య కెరీర్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డులను నమోదు చేసే అవకాశం ఉన్న ఈ సినిమా తర్వాత టైంలో ఎలివేషన్ సీన్స్ సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.
తమన్ కొట్టిన బ్యాగ్రౌండ్ స్కోర్ మేజర్ హైలెట్ గా నిలవగా సోషల్ మీడియాలో ఇతర ఇండస్ట్రీ ఆడియన్స్ కూడా డాకు మహారాజ్ క్వాలిటీ అండ్ ఎలివేషన్స్ మెచ్చుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో 136 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా…
ఇప్పటికీ ఒక థియేటర్ లో రన్ అవుతూ ఏకంగా 150 రోజులను అక్కడ పూర్తి చేసుకుని మాస్ రచ్చ చేసింది…ఆంధ్రలో చిలకలూరిపేట లో వెంకటేశ్వర థియేటర్ లో సినిమా రోజుకి 4 షోల తో రన్ అవుతూ ఏకంగా 150 రోజులను రీసెంట్ గా అక్కడ కంప్లీట్ చేసుకుని…
175 రోజుల వైపు పరుగులు పెడుతూ ఉండగా, రీసెంట్ బాలయ్య మూవీస్ అన్నీ కూడా ఇలా ఎక్స్ లెంట్ రన్ ను సొంతం చేసుకుని ఒకటి రెండు సెంటర్స్ లో దక్కించుకుని మాస్ రచ్చ చేశాయి… ఇక డాకు మహారాజ్ త్వరలో 175 రోజులను కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉండగా మరో పక్క సెప్టెంబర్లో అఖండ2(Akhanda2) తో బాలయ్య మరోసారి మాస్ రచ్చ చేయబోతున్నాడు.