బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పుడు రెండో వారం వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 12 వ రోజు తో పోల్చితే 13 వ రోజు ఫుల్ వర్కింగ్ డే అవ్వడం తో కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 35% టు 40% రేంజ్ లో డ్రాప్స్ ను ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో…
సొంతం చేసుకున్నా కానీ తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి కొద్ది వరకు గ్రోత్ ను సొంతం చేసుకోగా సినిమా మొత్తం మీద ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 3 కోట్ల రేంజ్ లోనే షేర్ ని అందుకునేలా ఉందని చెప్పాలి. కంప్లీట్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు…..
బాగుంటే కలెక్షన్స్ కొద్ది వరకు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇక హిందీ లో కూడా సినిమా స్లో డౌన్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 వ రోజు ఇప్పుడు 5 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ ని హిందీ లో సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి.
ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా లో మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.5 కోట్ల రేంజ్ నుండి 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది అని చెప్పాలి. దాంతో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియా లో సినిమా మొత్తం మీద 7.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఫైనల్ లెక్కలు బాగుంటే సినిమా 8 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం కూడా కొద్ది వరకు ఉండగా సినిమా ఓవర్సీస్ లో ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా 9 కోట్ల నుండి 9.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద అన్ని చోట్లా ఫైనల్ లెక్కలు బాగుంటే 10 కోట్ల రేంజ్ కి చేరువగా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు. మరి అఫీషియల్ 13 వ రోజు కలెక్షన్స్ 10 కోట్ల టార్గెట్ ను అందుకుంటుందో లేదో చూడాలి…