బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) రెండో వీక్ వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన సినిమా ఇంకా అందుకోవాల్సిన టార్గెట్ చాలా పెద్దగా ఉండగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ కి…
సరిపోవు అనే చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 190 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా సినిమా 13వ రోజు మరోసారి వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా సినిమా మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకోగా అవి నార్మల్ గానే ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎక్కువ మొత్తం…
రికవరీ చేయాల్సిన అవసరం ఉండటంతో ఈ హోల్డ్ సరిపోవు అనే చెప్పాలి. సినిమా మరో సారి బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 30% వరకు డ్రాప్ అవ్వగా హిందీలో సినిమా 30% రేంజ్ లో మరోసారి డ్రాప్ అయ్యింది… సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు…
26 లక్షల నుండి 30 లక్షల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక హిందీ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 80 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా మొత్తం మీద 13వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…
వరల్డ్ వైడ్ గా 65 లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఇంకొంచం పెరగవచ్చు కానీ సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక టోటల్ గా 13 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.