బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ సినిమా రెండో వారాన్ని పూర్తి చేసుకునే పనిలో ఉండగా వర్కింగ్ డేస్ లో సినిమా ఎంటర్ అయిన తర్వాత డ్రాప్స్ కొంచం లిమిటెడ్ గానే ఉన్నప్పటికీ కూడా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే అసలు ఈ కలెక్షన్స్ ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి…
ఇక 12వ రోజుతో పోల్చితే 13వ రోజులో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకోగా మేజర్ సెంటర్స్ లో కొంచమే అయినా షేర్స్ ని అయితే సొంతం చేసుకుంటుంది….ఓవరాల్ గా సినిమా 13వ రోజున ప్రజెంట్ ట్రెండ్ చూస్తూ ఉంటే…
20 లక్షల నుండి 22 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఫైనల్ లెక్కలు ఏమైనా బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక మిగిలిన చోట్ల సినిమా డ్రాప్స్ పర్వం కంటిన్యూ అవుతూ ఉండగా ఓవరాల్ గా సినిమా ఇప్పుడు…
13వ రోజున వరల్డ్ వైడ్ గా 30 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని 65 లక్షలకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు….మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఏమైనా జోరు చూపిస్తే తప్పితే ఇక కలెక్షన్స్ ఇలానే డౌన్ ట్రెండ్ లోనే….
ఉండే అవకాశం కనిపిస్తూ ఉండగా భారీ నష్టాలను సొంతం చేసుకోవడం ఇక ఖాయంగా కనిపిస్తుంది… మొత్తం మీద ఇక 13 రోజులు పూర్తి అయ్యే టైంకి గేమ్ చేంజర్ మూవీ సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.