బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమాకి అయినా మిక్సుడ్ టాక్ వస్తే ఆ సినిమా ప్రజెంట్ టైంలో హెవీ నెగటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక తేరుకునే అవకాశమే చాల తక్కువగా ఉంటుంది, అలాంటి హైప్ పెద్దగా లేకున్నా మిక్సుడ్ టాక్ ని మొదటి షో కే సొంతం చేసుకున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా….
ఊహకందని కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ఉండగా తమిళనాడులో అలాగే ఓవర్సీస్ లో రిమార్కబుల్ హోల్డ్ తో లాంగ్ రన్ లో అంచనాలను మించి కలెక్షన్స్ ని మిక్సుడ్ టాక్ తో రచ్చ చేసి ఏకంగా బ్రేక్ ఈవెన్ ని సైతం అందుకుని ఇప్పుడు లాభాలను కూడా పెంచుకుంటూ ఉండగా…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజు కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 400 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు 13వ రోజు మరోసారి వర్కింగ్ డే లో మంచి హోల్డ్ ని చూపెడుతూ తమిళ్ లో అలాగే ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ గా..
హోల్డ్ ని చూపెడుతూ ఇప్పుడు అటూ ఇటూగా 7-8 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు…
ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో సినిమా వరల్డ్ వైడ్ గా 200 కోట్ల ఎపిక్ షేర్ మార్క్ ని దాటేసింది….హైప్ లేకుండా వచ్చి మిక్సుడ్ టాక్ తో బ్రేక్ ఈవెన్ ని దాటేసి ఇప్పుడు ఏకంగా 200 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవడం మామూలు విషయం కాదు. ఇక టోటల్ గా సినిమా 13 రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక.