Home న్యూస్ 14 ఏళ్ళు బాలీవుడ్ లో నంబర్ 1 గా భారతీయుడు… ఎపిక్ రికార్డ్ కి 25...

14 ఏళ్ళు బాలీవుడ్ లో నంబర్ 1 గా భారతీయుడు… ఎపిక్ రికార్డ్ కి 25 ఏళ్ళు!

2734
0

ఇప్పుడు బాహుబలి పుణ్యామా అని చాలా సౌత్ మూవీస్ పాన్ ఇండియా లెవల్ లో కలెక్షన్స్ పరంగా జోరు చూపుతున్నాయి, కానీ హిందీ లో ఇంకా సౌత్ ఇండస్ట్రీ స్టేబుల్ గా కలెక్షన్స్ జోరు చూపాల్సి ఉంది, కానీ ఒకప్పుడు హిందీ లో సౌత్ మూవీస్ పరంగా డామినేట్ చేసిన సినిమాలు చాలా తక్కువే ఉండగా వాటిలో రేర్ రికార్డ్ ను సొంతం చేసుకున్న సినిమా గా విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన…

భారతీయుడు సినిమా సంచలనం సృష్టించింది… ఈ ఎపిక్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చి 25 ఏళ్ళు రీసెంట్ గా కంప్లీట్ అవ్వగా సినిమా సాధించిన ఈ రేర్ రికార్డ్ ఇప్పుడు అందరికీ తెలిసింది అని చెప్పొచ్చు. అప్పటి వరకు హిందీ లో సౌత్ మూవీస్ లో కొన్ని…

డబ్ అయ్యాయి కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఏ సినిమాలు అంచనాలను అందుకోలేదు. కానీ భారతీయుడు సినిమా ఇండియన్ పేరుతో అక్కడ డబ్ అయ్యి అల్టిమేట్ విజయాన్ని నమోదు చేసింది, ఈ సినిమా టోటల్ రన్ లో హిందీ లో ఏకంగా 12 కోట్ల నెట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది.

ఈ కలెక్షన్స్ ని ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలా కాలం వరకు ఏ సినిమా కూడా అందుకోలేక పోయింది. బాంబే సినిమా ఆల్ మోస్ట్ క్లోజ్ గా వచ్చినా 10 కోట్ల తో ఆగిపోయింది. ఆల్ మోస్ట్ భారతీయుడు సినిమా 14 ఏళ్ల పాటు సౌత్ మూవీస్ పరంగా హిందీ లో హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన సినిమాగా 1996 నుండి 2010 వరకు టాప్ లో ఉండగా…

2010 లో సూపర్ స్టార్ రజినీ నటించిన రోబో సినిమా హిందీ వర్షన్ 22 కోట్ల నెట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని భారతీయుడు పేరిట ఉన్న రికార్డ్ ను బ్రేక్ చేసింది. ఆల్ మోస్ట్ 14 ఏళ్ళు నంబర్ 1 గా అలానే కొనసాగిన ఈ సినిమా ఓ చరిత్ర సృష్టించింది, ఇప్పుడు భారతీయుడు 2 అడ్డంకులు తొలగి మొదటి పార్ట్ రేంజ్ లో ఉంటే ఊచకోత మరో లెవల్ లో ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here