Home న్యూస్ మాస్ మహారాజ్ కెరీర్ బెస్ట్ మాస్….14 ఏళ్ల బ్లాక్ బస్టర్ విక్రమార్కుడు…రికార్డ్ కొట్టిన ఫ్యాన్స్!!

మాస్ మహారాజ్ కెరీర్ బెస్ట్ మాస్….14 ఏళ్ల బ్లాక్ బస్టర్ విక్రమార్కుడు…రికార్డ్ కొట్టిన ఫ్యాన్స్!!

927
0

 

మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో విక్రమార్కుడు సినిమా కూడా ఒకటి. టాలీవుడ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ కమర్షియల్ మాస్ మూవీ అటు ఆడియన్స్ ని అలరించే సత్తిబాబు కామెడీ తో పాటు మాస్ కి గూస్ బంప్స్ తెప్పించే విక్రం రాథోడ్ పాత్ర తో అవుట్ అండ్ అవుట్ ఒక ఊరమాస్…

కమర్షియల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విద్వంసం సృష్టిస్తుందో చేసి చూపింది. బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పటికీ వేడి తగ్గని మహేష్ పోకిరి ని మాస్ ప్రభంజనం ముందు ఏమాత్రం తగ్గకుండా జోరు చూపి 19 కోట్ల రేంజ్ షేర్ ని వసూల్ చేసి ఊచకోత కోసింది.

ఎస్ ఎస్ రాజమౌళి రాసుకున్న పాత్రను తన అద్బుతమైన నటనతో డబుల్ ఇంపాక్ట్ కలిగించేలా చేశాడు మాస్ మహారాజ్. అలంటి విక్రమార్కుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 14 ఏళ్ళు పూర్తీ అయిన సందర్బంగా సోషల్ మీడియా ఫ్యాన్స్ భారీ ట్రెండ్ చేయగా సీనియర్ హీరోల్లో రికార్డ్ అందుకుంది విక్రమార్కుడు 14 ఏళ్ల ట్రెండ్..

24 గంటల్లో ఏకంగా 2 లక్షల 80 వేలకి అటూ ఇటూగా ట్వీట్స్ ని సొంతం చేసుకుని టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపారు…దాంతో మొత్తం మీద ఈ లిస్టులో టాప్ 2 ట్రెండ్స్ తో రవితేజ ఫ్యాన్స్ దుమ్ము లేపారు. మొదటి ప్లేస్ అలాగే 2 వ ప్లేస్ వాళ్ళవే అవ్వడం విశేషం…. ఒకసారి సీనియర్ హీరోల్లో టాప్ ట్రెండ్స్ ని గమనిస్తే…
👉#11YearsOfKICKMadness -310.6K
👉#14yearsForVikramarkudu – 280K~*

👉#DecadeForSimhaRoar -275K
👉#6YearsForClassicManam – 162.6K
👉#30GloriousYrsForIHJVAS – 51.5K~

ఇవీ మొత్తం మీద టాప్ సీనియర్ హీరోల యానివర్సరీ ట్రెండ్స్. ఇదే విక్రమార్కుడు సినిమా ఇప్పుడు భారీగా పెరిగిన టాలీవుడ్ మార్కెట్ లో రిలీజ్ అయ్యి ఉంటే రవితేజ కెరీర్ లోనే కాదు సీనియర్ హీరోల్లో కూడా బిగ్గెస్ట్ కలెక్షన్స్ రికార్డులు అందుకునేదని చెప్పొచ్చు. ప్రస్తుతం రవితేజ కూడా ఇలాంటి సినిమా కోసమే చూస్తున్నాడు. అది త్వరలో దక్కాలని కోరుకుందాం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here