ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ ఉండగా 15 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సినిమా 297.50 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 1427 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో వీర లెవల్ లో కుమ్మేసింది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16వ రోజు కొత్త సినిమాల నుండి పోటి ఎదురు అయినా కూడా ఉన్నంతలో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గానే జోరు చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఈ రోజు 2.6-2.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది.
ఇక కర్ణాటక, తమిళ్ మరియు కేరళ కలిపి సినిమా 1-1.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచం పెరగవచ్చు. ఇక హిందీలో రాంపెజ్ ను తిరిగి కొనసాగిస్తూ ఉన్న సినిమా మరోసారి కుమ్మేస్తూ…
15 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో కూడా మరోసారి మంచి జోరుని చూపిస్తున్న సినిమా మొత్తం మీద 16వ రోజున వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 21-22 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…
ఫైనల్ లెక్కలు హిందీ లో ఓవర్సీస్ లో బాగుంటే అంచనాలను మించే అవకాశం ఉంది. ఇక ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా 16 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మమ్మోత్ 300 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటబోతుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1450 కోట్ల లోపు గ్రాస్ ను సొంతం చేసుకోబోతుంది.
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కొంచం కలెక్షన్స్ అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ గా కొత్త సినిమాలు రిలీజ్ అయిన కూడా పుష్ప2 మాస్ రాంపెజ్ మాత్రం ఆగలేదు. ఇక శని ఆది వారాల్లో మరింత జోరుని సినిమా చూపించే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 16 రోజుల్లో సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.