ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ది రైజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అవుతూ వస్తుంది. వీకెండ్ లో రెట్టించిన జోరు చూపెట్టిన సినిమా టాక్ ని కూడా పక్కకు పెట్టి సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వర్కింగ్ డేస్ లో మాత్రం స్లో అవ్వక తప్పలేదు… సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 11 వ రోజు అలాగే 12 వ రోజు…
డ్రాప్స్ కొంచం ఎక్కువగానే సొంతం చేసుకుంది, దానికి తోడూ ఆంధ్రలో థియేటర్స్ మూసెయ్యడం అనే ప్రాసెస్ కొనసాగుతూ ఉండటం లాంటివి కూడా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపుతుంది. సినిమా మొత్తం మీద 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 1.05 కోట్ల షేర్ ని అందుకోగా….
12 వ రోజు కి వచ్చే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 69 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. కానీ అదే టైం లో హిందీ లో సినిమా ఎక్స్ లెంట్ హోల్డ్ ని కొనసాగించడంతో ఓవరాల్ షేర్ బాగానే సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 38.16Cr(Without GST 35.15Cr)
👉Ceeded: 13.23Cr
👉UA: 7.27Cr
👉East: 4.45Cr
👉West: 3.67Cr
👉Guntur: 4.70Cr
👉Krishna: 3.86Cr
👉Nellore: 2.86Cr
AP-TG Total:- 78.20CR(121.26CR~ Gross)
👉Karnataka: 10.24Cr
👉Tamilnadu: 8.43Cr
👉Kerala: 4.63Cr
👉Hindi: 20.65Cr
👉ROI: 2.14Cr
👉OS – 12.60Cr
Total WW: 136.89CR(240.50CR~ Gross)
ఇవీ సినిమా 12 రోజుల టోటల్ కలెక్షన్స్…
సినిమాను మొత్తం మీద 144.9 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 146 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొత్తం మీద 12 రోజులు పూర్తీ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 9.11 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.