బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారాన్ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉన్న ప్రభాస్(Prabhas) ఆదిపురుష్(AdiPurush) మూవీ కి పెద్దగా రిలీజ్ లో హాలిడేస్ ఏవి పడలేదు… నార్మల్ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమా మొదటి వీకెండ్ లో దుమ్ము లేపినా కానీ తర్వాత మాత్రం…
కంప్లీట్ గా స్లో అవ్వగా రెండో వీకెండ్ కొంచం పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు రెండో వీక్ వర్కింగ్ డేస్ లో మళ్ళీ స్లో డౌన్ అయిన సినిమా ఇప్పుడు 14వ రోజున బక్రీద్ హాలిడే అడ్వాంటేజ్ లభించింది కానీ మరో పక్క…
కొత్త సినిమాల నుండి పోటి కూడా ఎదురు అవ్వడంతో మళ్ళీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ మరీ ముందు రోజులతో పోల్చితే కొంచం బెటర్ గానే బుకింగ్స్ ఉన్నాయని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే అటూ ఇటూగా ఇప్పుడు…
25-30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి, అన్ని చోట్లా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఈ షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి.
మొత్తం మీద రెండు వారాల తర్వాత సినిమా అందుకోవాల్సిన టార్గెట్ ఇంకా కొండంత ఉండటంతో ఇక సినిమా నష్టాలను పూడ్చడానికి పెద్దగా అవకాశం లేనట్టే అని చెప్పాలి. ఇక టోటల్ గా సినిమా మొత్తం మీద 2 వారాలను గాను సాధించే కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి.