అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే సంక్రాంతికి రికార్డుల జాతర సృష్టించాల్సిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యి టార్గెట్ కి ఇంకా సగానికి పైగా రికవరీని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా…
సినిమా రెండో వారాన్ని పూర్తి చేసుకునే పనిలో ఉండగా 14వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి వర్కింగ్ డే లో ఉండగా ఓవరాల్ గా 13వ రోజు తో పోల్చితే లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపిస్తూ ఉన్నప్పటికీ కూడా..
అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా చాలా దూరమే వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 13వ రోజుకి సిమిలర్ గా ట్రెండ్ అవుతున్న సినిమా ఈ రోజు అటూ ఇటూగా 20 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక హిందీ తో పాటు మిగిలిన అన్ని చోట్లా కూడా స్లో డౌన్ అయిన సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 14వ రోజున ఇప్పుడు 28-30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు..ఓవరాల్ గా సినిమా వర్కింగ్ డేస్ లో ఉన్నంతలో….
కొంచం పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపెడుతూ ఉండగా కొంచం టాక్ పాజిటివ్ గా ఉండి ఉంటే డీసెంట్ రికవరీని సొంతం చేసుకుని ఉండేది సినిమా…ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 2 వారాలు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.