బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush)ల కాంబో మూవీ కుబేర(Kuberaa Movie) సినిమా తమిళ్ వర్షన్ అంచనాలను అందుకోకపోవడంతో అక్కడ సాధించాల్సిన కలెక్షన్స్ ని కూడా తెలుగు వర్షన్ నుండే రాబట్టాల్సిన అవసరం ఏర్పడగా కుబేర ఉన్నంతలో మంచి హోల్డ్ నే చూపెడుతూ…
ఇప్పుడు రెండు వారాలను కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. ఉన్నంతలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14వ రోజున మరోసారి 13వ రోజుతో కంపేర్ చేస్తే లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుని ఉన్నంతలో ఓకే అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా…
తమిళ్ లో మాత్రం కంప్లీట్ గా డ్రాప్ అయిన సినిమా కొన్ని చోట్ల మాత్రమే అక్కడ రన్ ను కొనసాగిస్తుంది. ఉన్నంతలో కర్ణాటకలో ఓకే అనిపిస్తున్న సినిమా ఓవర్సీస్ లో కూడా పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తూ ఉండగా… ఓవరాల్ గా 14వ రోజున కుబేర…
తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 26-28 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 40 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా…
షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే లెక్క కొంచం పెరిగే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా గ్రాస్ 80 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద రెండు వారాలను గ్రాండ్ గా కంప్లీట్ చేసుకోబోతున్న సినిమా…
ఉన్నంతలో తమిళ్ వర్షన్ హ్యాండ్ ఇచ్చినా తెలుగు వర్షన్ మాత్రం తమిళ్ వర్షన్ నష్టాలను కవర్ చేయాల్సిన అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా రెండు వారాలను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకోబోతున్న సినిమా ఇక మూడో వీక్ లో ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి.