చప్పగా సాగిన ఏప్రిల్ నెలలో ఒక్క హిట్ మూవీ కూడా టాలీవుడ్ కి సొంతం అవ్వలేదు…ఇక మే నెలలో ఆడియన్స్ ముందుకు వచ్చిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) సినిమాలు…
మంచి జోరుని చూపెడుతూ కలెక్షన్స్ పరంగా టార్గెట్ ను దాటేసి మంచి లాభాలను సొంతం చేసుకుంటూ వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండగా హిట్3 మూవీ 14వ రోజులో ఎంటర్ అవ్వగా మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర…
పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటూ ఇటూగా 30లక్షల రేంజ్ నుండి 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
45 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక సింగిల్ మూవీ మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే 60 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 80 లక్షల రేంజ్ నుండి 85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక రెండు సినిమాలను ప్రాఫిట్స్ ను పెంచుకుంటూ ఉండగా ఈ వీకెండ్ లో మరోసారి రెండు సినిమాలు జోరు చూపించవచ్చు. ఇక టోటల్ గా రెండు సినిమాల ఈ రోజు అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.