బాక్స్ ఆఫీస్ దగ్గర లవ్ టుడే సినిమాతో సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన లేటెస్ట్ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return Of The Dragon) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ టాక్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా…
తెలుగులో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేసిన సినిమా అన్ని చోట్లా మాస్ రాంపెజ్ ను చూపించింది…తెలుగు లో టోటల్ రన్ లో 21 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా వరల్డ్ వైడ్ గా సినిమా తమిళ్ వర్షన్ తో కలిపి 150 కోట్లకు పైగా…
గ్రాస్ మార్క్ ని అందుకుని అల్టిమేట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 30 కోట్ల బిజినెస్ తో బరిలోకి దిగి 73.45 కోట్ల షేర్ తో 43.45 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా తెలుగు లో టెలివిజన్ లో కూడా మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది.
స్టార్ మా ఛానెల్ వాళ్ళు తక్కువ రేటుకే సినిమా శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకోగా రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ చేయగా ఫస్ట్ టెలికాస్ట్ లో సినిమా 6.16 రేంజ్ లో టి.ఆర్.పి రేటింగ్ సొంతం చేసుకుంది. ఇది ఆల్ మోస్ట్ రీసెంట్ టైంలో తెలుగు లో….
మంచి క్రేజ్ తో రిలీజ్ అయిన పెద్ద సినిమాలకు టెలివిజన్ లో వచ్చిన రేటింగ్ కి ఈక్వల్ అని చెప్పాలి. ఆ రేంజ్ లో సినిమా ఫస్ట్ టెలికాస్ట్ లోనే జోరు చూపించగా ఛానెల్ పెట్టిన రేటు లో చాలా మొత్తం ఫస్ట్ టెలికాస్ట్ కే రికవరీ అయ్యింది అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో టెలివిజన్ లో కూడా సినిమాకి మంచి లాభాలు దక్కే అవకాశం ఎంతైనా ఉంది.