బాక్స్ ఆఫీస్ దగ్గర లాక్ డౌన్ టైం లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి సాలిడ్ ఓపెనింగ్స్ తో కుమ్మేసిన సినిమా భాగీ… టైగర్ ష్రాఫ్ హీరోగా తెలుగు తడాకా రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా హిందీ లో ఈ ఇయర్ కి గాను బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో 97 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ ని… అందుకున్న ఈ సినిమా…
తర్వాత కరోనా వలన పరుగును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. సినిమా ఇండియా లో మొత్తం మీద 80 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేయగా…. క్లీన్ హిట్ అవ్వాలి అంటే 150 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద….
10 రోజులకు 97 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకోగా పరుగును మధ్యలోనే ఆపేయడం తో సినిమా కి నష్టం వచ్చింది. కాగా ఇప్పుడు సినిమా తిరిగి ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ నెల 15 నుండి ఇండియా లో థియేటర్స్ చాలా రాష్ట్రాలలో రీ ఓపెన్ అవ్వబోతున్నాయి కాబట్టి… ఈ సినిమా ను మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు.
ఇండియా వైడ్ గా సినిమా ను సుమారు 300 వరకు థియేటర్స్ లో రీ రిలీజ్ చేయబోతుండటంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ పరుగును ఎక్కడైతే ఆపిందో మళ్ళీ అక్కడి నుండే మొదలు పెట్టబోతుంది ఈ సినిమా.. సినిమా మరో 3 కోట్ల కలెక్షన్స్ ని వసూల్ చేస్తే 100 కోట్ల లీగ్ లో ఎంటర్ అవుతుంది… సినిమా ఆల్ రెడీ డిజిటల్ లో రిలీజ్ కూడా అయినా…
తిరిగి థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధం అవుతుండటంతో ఎంతవరకు మాస్ ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు అన్నది ఆసక్తి కరంగా మారింది. ఇక ఈ సినిమా తో పాటుగా మరిన్ని బాలీవుడ్ అండ్ లోకల్ మూవీస్ కూడా 15 నుండి రీ రిలీజ్ కానుండగా కొత్త సినిమాలు మాత్రం మరింత టైం తీసుకుని రిలీజ్ అవ్వాలని భావిస్తున్నాయి.