పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ రెండో వీక్ లో ఎంటర్ అవ్వగా సినిమా9 వ రోజు వీకెండ్ అడ్వాంటేజ్ వలన సినిమా శనివారం మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును కొనసాగించగా 10 వ రోజు ఆదివారం అవ్వడంతో ఈ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మొత్తం మీద మరోసారి పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని….
సొంతం చేసుకోబోతుంది అని చెప్పాలి. సినిమా 10 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 1.5 కోట్ల నుండి 1.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.8 కోట్ల నుండి 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఈ రోజు సొంతం చేసుకునే అవకాశం ఉంది, దాంతో మొత్తం మీద సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో…
111.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 151.80 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు. మొత్తం మీద ప్రతిష్టాత్మక 150 కోట్ల మార్క్ ని అందుకున్న సినిమా టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది…