బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా తెరకెక్కిన రాయన్(Raayan Movie) కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి…
సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…అలాంటి రన్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా పరుగును కంప్లీట్ చేసుకుని డిజిటల్ లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న రాయన్ మూవీకి…అక్కడ నుండి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అయ్యింది అన్నది ఆసక్తిగా…
సినిమాను థియేటర్స్ లో చూసినప్పుడు మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత సినిమా కి కంప్లీట్ గా మిక్సుడ్ రెస్పాన్స్ వినిపిస్తుంది. సినిమా స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ వరకు కూడా ఎక్స్ లెంట్ గా సాగిన సినిమా…
ఇంటర్వెల్ ఎపిసోడ్ లో యాక్షన్ పార్ట్ ఓ రేంజ్ లో హైలెట్ అవ్వగా సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం కూడా సాలిడ్ గా ఆకట్టుకున్నా కూడా ఎప్పుడైతే హీరో అన్నదమ్ములు ఇద్దరు హీరోని కత్తితో పోడుస్తారో అక్కడ నుండి కథ మొత్తం ట్రాక్ తప్పగా అన్ననే తమ్ముళ్ళు కత్తితో పొడవడానికి బలమైన కారణాలు చూపించలేదు అని చెప్పాలి.
అక్కడ నుండి ట్రాక్ తప్పిన సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా కంప్లీట్ గా ఇంపాక్ట్ లెస్ గా అనిపించింది అని చెప్పాలి. ఎస్ జే సూర్య విలన్ గా మెప్పించినా, విలన్ రోల్ కి కూడా సరైన డెప్త్ లేకుండా పోయిందని అని చెప్పాలి…మొత్తం మీద ఫస్టాఫ్ ఓ రేంజ్ లో కుమ్మేసిన సినిమా…
సెకెండ్ ఆఫ్ లో కొద్ది సేపు బాగానే సాగినా కూడా తర్వాత ట్రాక్ తప్పేసి బిలో పార్ గా ముగిసినా కూడా ఓవరాల్ గా ఒక డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ ని అయితే ఆడియన్స్ కి ఇచ్చింది అని చెప్పాలి. సెకెండ్ ఆఫ్ లో దొర్లిన ఆ తప్పులను ముందే చూసుకుని ఉంటే సినిమా రేంజ్ కి మించి జోరు చూపించేది అని చెప్పొచ్చు. టాక్ ఎలా ఉన్నా కూడా డిజిటల్ లో సెన్సేషనల్ వ్యూవర్ షిప్ తో రచ్చ చేస్తుంది సినిమా ఇప్పుడు.