పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ ఫస్ట్ వీకెండ్ లో కుమ్మేసినా తర్వాత స్లో అయింది. మళ్ళీ 10 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర బెటర్ గా పెర్ఫార్మ్ చేసిన సినిమా ఇప్పుడు 11 వ రోజు మళ్ళీ వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన భారీగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా ఇప్పుడు….
రెండు తెలుగు రాష్ట్రాలలో 11 వ రోజు 80 లక్షల నుండి 85 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునేలా ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా కోటికి అటూ ఇటూ గా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు, అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సాధ్యం…
ఇక ఈ కలెక్షన్స్ తో సినిమా 11 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 113.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అలాగే వరల్డ్ వైడ్ గా 155 కోట్ల రేంజ్ గ్రాస్ తో పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ 150 కోట్ల గ్రాస్ మార్క్ దాటి ఇప్పుడు 155 కోట్లతో కొత్త బెంచ్ మార్క్ ని అందుకోబోతుంది. ఇక అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…