బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 15 వీకెండ్ లో భారీ లెవల్ లో రిలీజ్ అయిన మూవీస్ లో చియాన్ విక్రమ్(Chiyaan Vikram) నటించిన తంగలాన్(Thangalaan Movie) మూవీ ఒకటి…తమిళ్ లో మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు లో మిక్సుడ్ రివ్యూలను సొంతం చేసుకున్నా కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించినా ఈ సినిమా తమిళ్ లో మాత్రం వచ్చిన పాజిటివ్ టాక్ …
అడ్వాంటేజ్ ను పెద్దగా వాడుకోలేక పోయింది. దాంతో కలెక్షన్స్ పరంగా మంచి స్టార్ట్ తర్వాత కంటిన్యూగా సినిమా కలెక్షన్స్ లో డ్రాప్స్ రాగా మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 66 కోట్లకు ఇంకా చాలా దూరంలోనే ఆగిపోయిన సినిమా 2 వారాలను పూర్తి చేసుకోగా చాలా చోట్ల రన్ కూడా ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
15 రోజుల్లో ఓవరాల్ గా 70 కోట్ల లోపే గ్రాస్ ను ట్రేడ్ లెక్కల్లో సొంతం చేసుకోగా మేకర్స్ మాత్రం సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది అంటూ పోస్టర్ ను రిలీజ్ చేశారు…మన దగ్గర కూడా వచ్చిన కలెక్షన్స్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ ని పోస్టర్స్ లో వేయడం కామనే కానీ, కోలివుడ్ వాళ్ళు మేం జెన్యూన్ జెన్యూన్ అని అంటూ ఉంటారు కానీ..
ఇప్పుడు వాళ్ళే ఇలాంటివి చేయడం సోషల్ మీడియాలో ట్రోల్స్ కి కారణం అవుతున్నాయి ఇప్పుడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు లో సాధించిన ట్రేడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Thangalaan 15 Days Telugu States Collections
👉Nizam: 2.06Cr~
👉Ceeded: 65L
👉Andhra: 1.81Cr
AP-TG Total:- 4.52CR(8.90CR~ Gross)
6.50 కోట్ల టార్గెట్ కి సినిమా ఇంకా 1.98 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక రన్ ఆల్ మోస్ట్ ఎండ్ అయినట్లే అని చెప్పాలి ఇక్కడ. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Thangalaan 15 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 36.00Cr
👉Telugu States- 8.90Cr
👉Karnataka- 4.25Cr
👉Kerala – 3.10Cr
👉ROI – 0.75Cr
👉Overseas – 16.80CR****
Total WW collection – 69.80CR(33.15CR~ Share)
ఓవరాల్ గా 15 రోజుల్లో 70 కోట్ల లోపే గ్రాస్ ను అందుకున్న సినిమా 66 కోట్ల వాల్యూ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 32.85 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక రన్ ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేయడంతో ఇక సినిమా తేరుకునే అవకాశం చాలా తక్కువే అని చెప్పాలి ఇప్పుడు.