Home న్యూస్ 15 డేస్ 90 ఔట్….దంచికొట్టిన నాచురల్ స్టార్!!

15 డేస్ 90 ఔట్….దంచికొట్టిన నాచురల్ స్టార్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాలను ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా ఇప్పటికీ స్టడీగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపెడుతూ లాభాలను పెంచుకుంటూ ఉంది..

సినిమా తెలుగు రాష్ట్రాల్లో స్లో డౌన్ అవ్వగా ఓవర్సీస్ లో కొంచం గ్రోత్ ని చూపించిన సినిమా ఓవరాల్ గా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 90 కోట్ల రేంజ్ గ్రాస్ కి దగ్గర అవ్వడం విశేషం అని చెప్పాలి… మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా…

14వ రోజుతో పోల్చితే 9 లక్షల రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా 15వ రోజు మొత్తం మీద 18 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 36 లక్షల రేంజ్ లో షేర్ ని 75 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు టోటల్ గా…

Saripodhaa Sanivaaram Movie 15 Days Total WW Collections!

15 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Saripodhaa Sanivaaram Movie 15 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 13.95Cr
👉Ceeded: 3.64Cr
👉UA: 3.74Cr
👉East: 1.96Cr
👉West: 1.43Cr
👉Guntur: 1.80Cr
👉Krishna: 1.79Cr
👉Nellore: 1.22Cr
AP-TG Total:- 29.53CR(49.30CR~ Gross)
👉Ka+Tamil+ROI: 6.93Cr
👉OS: 12.10Cr***
Total WW Collections:- 48.56CR(89.95CR~ Gross)

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 6.56 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా హిట్ నుండి సూపర్ హిట్ దిశగా దూసుకు పోతుంది. ఇక సినిమా మూడో వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Saripodhaa Sanivaaram Movie 10 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here