Home న్యూస్ డ్రాగన్ హెచ్చరిక….15 నెలల్లో 3…నిజం అయితే అల్లకల్లోలం ఖాయం!

డ్రాగన్ హెచ్చరిక….15 నెలల్లో 3…నిజం అయితే అల్లకల్లోలం ఖాయం!

0
NTR - Prashanth Neel Dragon Movie Release Date Confirmed
NTR – Prashanth Neel Dragon Movie Release Date Confirmed

బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో హీరోగా అరవింద సమేత(Aravindha Sametha) తర్వాత ఆల్ మోస్ట్ 6 ఏళ్ల గ్యాప్ తీసుకుని ఇప్పుడు దేవర(Devara Part 1)తో మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR)…. సెప్టెంబర్లో 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పాలి ఇప్పుడు…

ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి చేస్తున్న వార్2(War 2 Movie) మీద అంచనాలు మరో లెవల్ లో ఉండగా 2025 ఇయర్ లో ఆగస్టు లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది….

ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాగా మరో క్రేజీ పాన్ ఇండియా మూవీ ని కన్ఫాం ఎప్పుడో చేయగా ఇప్పుడు అఫీషియల్ గా లాంచ్ చేశారు…కేజిఎఫ్ సిరీస్ సలార్ తో పాన్ ఇండియా రేంజ్ లో బిగ్గెస్ట్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న సినిమా ఎప్పుడో అనౌన్స్ చేసినా ఎట్టకేలకు రీసెంట్ గా అఫీషియల్ గా లాంచ్ చేశారు…కాగా ఇకా లాంచ్ చేశారో లేదో అప్పుడే సినిమా రిలీజ్ డేట్ ను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసి సంచలనం సృష్టించారు ఇప్పుడు. సినిమాకి అనఫీషియల్ గా డ్రాగన్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు….

టాక్ స్ట్రాంగ్ గా ఉండగా ఆడియన్స్ ముందుకు ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న  రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు ఇప్పుడు….అంటే 15 నెలల ముందే రిలీజ్ డేట్ ను కన్ఫాం చేసి డ్రాగన్ హెచ్చరికని అందరికీ సెండ్ చేశారు ఇప్పుడు…దాంతో ఆ టైంకి ఇండియా వైడ్ గా డ్రాగన్ హవా ఉండే అవకాశం ఉండగా…

అన్నీ అనుకున్నట్లు జరిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 15 నెలల గ్యాప్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 3 క్రేజీ పాన్ ఇండియా బిగ్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి…..అన్నీ అంచనాలను అందుకుంటే ఇక ఎన్టీఆర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్స్ లో ఒకరిగా నిలిచే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here