నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా ఎక్స్ లెంట్ ఓవరాల్ గా సాలిడ్ రికవరీని సొంతం చేసుకుని రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వీక్ లో అడుగు పెట్టగా 15వ రోజు సినిమాకి సండే తో పాటు రిపబ్లిక్ డే అడ్వాంటేజ్ కూడా లభించడంతో…
మంచి జోరుని చూపెడుతున్న సినిమా రికవరీని మరింతగా దక్కించుకుంటూ దూసుకు పోతుంది. మేజర్ గ్రోత్ తెలుగు రాష్ట్రాల్లో ఉండగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో కొంచం ట్రెండ్ వీక్ గానే ఉంది…ఓవరాల్ గా సినిమా 14వ రోజు మీద కొంచం గ్రోత్ ని చూపిస్తున్న సినిమా…
మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే ఓవరాల్ గా 65-70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక మిగిలిన చోట్ల మరీ అనుకున్న రేంజ్ లో ట్రెండ్ లేదు కాబట్టి..
వరల్డ్ వైడ్ గా సినిమా 15వ రోజున 80 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ కి మరికొంత దగ్గరగా వెళ్ళింది అని చెప్పాలి.
ఓవరాల్ గా 15వ రోజున వరల్డ్ వైడ్ గా 1.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 15 రోజుల్లో సినిమా సాధించే అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.