బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 2 వారాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) మూవీ మూడో వారంలో అడుగు పెట్టగా 15వ రోజున మరికొన్ని కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపెడుతూ…
దూసుకు పోతున్న దేవర మూవీ మరోసారి ఇప్పుడు 15వ రోజున ఎక్స్ లెంట్ గా జోరుని చూపెడుతూ 14వ రోజుకి సిమిలర్ గా ట్రెండ్ అవుతూ ఉండగా ఈవినింగ్ షోలకు మంచి ఆక్యుపెన్సీతో రన్ అవుతుంది ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల ఆవల కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన..
షోలు తగ్గినా కర్ణాటకలో మంచి హోల్డ్ ని చూపిస్తున్న సినిమా హిందీలో కూడా బాగానే హోల్డ్ చేసింది లిమిటెడ్ థియేటర్స్ లో…మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 15వ రోజున తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు 1.6-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే…
అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ మరికాస్త పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక హిందీలో సినిమా ఈ రోజు 50 లక్షల కలెక్షన్స్ మార్క్ ని అందుకోబోతూ ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో ఓవరాల్ గా…
35-40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఈ కలెక్షన్స్ తో ఓవరాల్ గా 15వ రోజు వరల్డ్ వైడ్ గా 2.4-2.5 కోట్ల మధ్యలో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా నైట్ షోలకు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో గ్రోత్ బాగుంటే ఈ లెక్క…
ఇంకా మించి పోయి మరింత జోరు పెంచి షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. మొత్తం మీద మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తున్న దేవర ఇక శనివారం నుండి దసరా పండగ సెలవుల అడ్వాంటేజ్ తో మరింత జోరు పెంచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక టోటల్ గా 15 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.