ధనుష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సార్ బాక్స్ ఆఫీస్ దగ్గర దిగ్విజయంగా 2 వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు మూడో వారంలో ఎంటర్ అయింది, సినిమా అన్ని చోట్లా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించగా తమిళనాడులో మాత్రం మరికొంత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సినిమా… ఆ ఒక్క చోట తప్పితే అన్ని చోట్లా సినిమాకి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ సొంతం అయ్యాయి ఇప్పటి వరకు కూడా…
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14వ రోజుతో పోల్చితే 15వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ సిమిలర్ గానే ట్రెండ్ అవుతూ ఉండగా తమిళనాడులో కూడా బుకింగ్స్ బాగానే ఉన్నాయి. మొత్తం మీద ఇప్పుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 15వ రోజున…
అటూ ఇటూగా 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజు అటూ ఇటూగా…
85 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఇక సినిమా వీకెండ్ లో మాత్రం తిరిగి గ్రోత్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి.