సంక్రాంతికి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ కి ముందు అనేక అనుమానాల నడుమ రిలీజ్ అయినా ఒక్కసారి బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన తర్వాత సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ రచ్చ చేసిన ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి దుమ్ము లేపుతూ దూసుకుపోతూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల షేర్ మార్క్ ని ఆల్ రెడీ దాటేసిన సినిమా…
ఇప్పుడు ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ అందుకున్న సినిమాల్లో కూడా ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. ఆచార్య గాడ్ ఫాదర్ లాంటి ఫ్లాఫ్ మూవీస్ తర్వాత వచ్చిన ఈ సినిమా నాన్ స్టాప్ గా 12 రోజులు ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ ని అందుకోగా….
ఇప్పుడు మొత్తం మీద 17 రోజులలో మొత్తం మీద 2 రోజులు మినహా మిగిలిన అన్ని రోజులు కూడా కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుంది. 13వ రోజు అలాగే 15వ రోజు సినిమా కోటి లోపు షేర్ ని సొంతం చేసుకోగా మిగిలిన అన్ని రోజులు కూడా సినిమా…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మిగిలిన సినిమాలు అన్నింటినీ కూడా ఓ రేంజ్ లో లీడ్ ని చూపిస్తూ డామినేట్ చేసి ఊచకోత కోసింది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని పరుగును పూర్తీ చేసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.