బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున మరియు యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు సంక్రాంతి అడ్వాంటేజ్ వలన పండగ వీకెండ్ లో మంచి వసూళ్ళతో దుమ్ము లేపింది కానీ తర్వాత సినిమా కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అయింది. జనాలు థియేటర్స్ కి చాలా తక్కువగా వస్తూ ఉండటం అండ్ థర్డ్ వేవ్ ఇంపాక్ట్ కూడా ఎఫెక్ట్ చూపెట్టడం తో బంగార్రాజు లాంగ్ రన్ పై…
ఈ ఎఫెక్ట్ గట్టిగానే పడుతూ ఉండగా కలెక్షన్స్ పరంగా బ్రేక్ ఈవెన్ ని రెండో వారంలోనే అందుకుంటుంది అనుకున్న సినిమా స్లో డౌన్ అయ్యి లాస్ట్ స్టేజ్ లో హిట్ కి మరింత కష్టపడాల్సిన అవసరం తో పరుగును కొనసాగిస్తూ ఉందని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
16 వ రోజు 15 వ రోజు తో పోల్చితే 8 లక్షల దాకా గ్రోత్ ని చూపెట్టి 22 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది, కానీ బ్రేక్ ఈవెన్ కోసం మరింత కలెక్షన్స్ అవసరం అనే చెప్పాలి. ఇక సినిమా టోటల్ గా 16 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 8.20Cr
👉Ceeded: 6.67Cr
👉UA: 5.08Cr
👉East: 4.05Cr
👉West: 2.84Cr
👉Guntur: 3.38Cr
👉Krishna: 2.20Cr
👉Nellore: 1.72Cr
AP-TG Total:- 34.14CR(55.40Cr~ Gross)
👉Ka+ROI: 1.75Cr
👉OS – 1.47Cr
Total WW: 37.36CR(62.75CR~ Gross)
నైజాం ఏరియా వలన సినిమా కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పాలి. అక్కడ కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో వచ్చి ఉంటే…
బంగార్రాజు ఈ పాటికి లాభాల బాట పట్టేది కానీ ఇప్పుడు క్లీన్ హిట్ కోసం ఇంకా 1.64 కోట్ల దాకా వసూళ్లు అందుకోవాల్సి ఉంది. ఈ చివరి అడుగుని సినిమా ఇంకా ఎన్ని రోజులు కష్టపడి అందుకుంటుందో లేదో అన్నది ఆసక్తిగా మారగా మరో వారం పది రోజులు థియేటర్స్ కావలసినన్ని ఉంటాయి కాబట్టి లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అయినా బ్రేక్ ఈవెన్ కి చేరువ అవ్వొచ్చు. ఇక ఈ రోజు సండే కాబట్టి ఏమైనా గ్రోత్ ఉంటుందో లేదో చూడాలి.