బాక్స్ అఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(JR NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుని రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ మూవీస్ లో బెస్ట్ లాంగ్ రన్ ను దక్కించుకుంటూ దుమ్ము దుమారం లేపుతుంది.
కాగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో రన్ ఇంకా స్టడీగానే సాగుతూ లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండగా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా 112.55 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు బిజినెస్ మీద సాలిడ్ లాభాలాను దక్కించుకుంటూ ఎన్టీఆర్ కెరీర్ లో…
ఆల్ రెడీ ఎపిక్ రికార్డ్ కలెక్షన్స్ ని అలాగే లాభాలను అందుకుని సంచలనం సృష్టించింది. లేటెస్ట్ గా సినిమా తెలుగు రాష్ట్రాల టోటల్ షేర్ లెక్క అక్షరాలా 160 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించింది….దీపావళి వరకు షేర్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.
మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 112.55 కోట్ల బిజినెస్ మీద సినిమా 47.50 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో…ఇందులో ఒక్క నైజాం ఏరియాలోనే 18 కోట్లకు పైగా ప్రాఫిట్ ను దక్కించుకున్న దేవర మూవీ…
సీడెడ్ లో 9 కోట్లకు పైగా ప్రాఫిట్ ను అందుకుంది….సీడెడ్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని అప్ కమింగ్ బిగ్ పాన్ ఇండియా మూవీస్ కూడా టచ్ చేయడం కొంచం కష్టంతో కూడుకున్న పనే…ఇక మిగిలిన రన్ పూర్తి అయ్యే టైంకి సినిమా ఓవరాల్ గా ఇంకా ఎంతవరకు లాభాలాను అందుకుంటుందో చూడాలి.