Home న్యూస్ క్రేజ్ లేని సినిమాతో 16 కోట్ల మాస్ జాతర…అజిత్ కుమార్ మాస్ రాంపెజ్!!

క్రేజ్ లేని సినిమాతో 16 కోట్ల మాస్ జాతర…అజిత్ కుమార్ మాస్ రాంపెజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి…కోలివుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన తల అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ విదాముయ‌ర్చి(Vidaamuyarchi) మూవీ మరోటి నాగ చైతన్య నటిస్తున్న తండేల్…తెలుగు లో తండేల్ కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తూ ఉన్నా…

తండేల్ తో పోల్చితే ఆడియన్స్ లో అనుకున్న రేంజ్ లో బజ్ ను క్రియేట్ చేయలేక పోయినా కూడా జస్ట్ అజిత్ కుమార్ స్టార్ పవర్ తో తమిళనాడులో ప్రకంపనలు సృష్టించడానికి సిద్ధం అవుతుంది విదాముయ‌ర్చి సినిమా…ట్రైలర్ పెద్దగా క్లిక్ కాక పోయినా కూడా..

జస్ట్ అజిత్ కుమార్ స్టార్ పవర్ తో అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ఓ రేంజ్ లో జోరు చూపెడుతూ మాస్ రచ్చ చేస్తుంది. పెద్దగా ప్రమోషన్స్ కూడా ఏమి జరగలేదు కానీ సినిమా మొదటి రోజుకి గాను ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఇప్పుడు 15 కోట్ల మార్క్ ని దాటేసింది.

తమిళనాడు లో వీకెండ్ మొత్తానికి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 22 కోట్ల రేంజ్ దాకా జరగడం సినిమా ఏ రేంజ్ లో కుమ్మేస్తుందో అన్నదానికి నిదర్శనం. అందులో మొదటి రోజుకి గాను సినిమా ఆల్ మోస్ట్ 10 కోట్లకు చేరువ అయ్యే రేంజ్ లో..

గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో కోటిన్నర రేంజ్ లో అలాగే ఓవర్సీస్ లో ఆల్ మోస్ట్ హాల్ఫ్ మిలియన్ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ను ఆల్ రెడీ సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద మొదటి రోజుకి గాను వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్..

ఆల్ మోస్ట్ 16 కోట్ల మార్క్ ని అందుకోవడంతో మొదటి రోజు ఊరమాస్ స్టార్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. సినిమాకి ఏమాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా కూడా ఓపెనింగ్స్ మరింత దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here