బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాల క్రితం రిలీజ్ అయిన కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush)ల కాంబో మూవీ కుబేర(Kuberaa Movie) సినిమా యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్ వీకెండ్ లో వీర విహారం చేసి తర్వాత వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా రెండో వీకెండ్ లో..
మళ్ళీ మాస్ రచ్చ చేయగా తర్వాత వర్కింగ్ డేస్ లో మళ్ళీ స్లో డౌన్ అయింది. ఇక తమిళ్ వర్షన్ మొదటి వీక్ తర్వాత ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించకపోవడంతో అక్కడ భారీగానే లాస్ ను సొంతం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడగా…
అక్కడ నష్టాలను కూడా తెలుగు వర్షన్ నుండే కవర్ చేయాల్సి రాగా సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోవడానికి కొంత టైం పట్టగా ఇప్పుడు ఎట్టకేలకు వరల్డ్ వైడ్ గా 16 వ రోజున సాధించిన కలెక్షన్స్ తో కుబేర సినిమా వరల్డ్ వైడ్ గా…
బ్రేక్ ఈవెన్ ని అందుకుని క్లీన్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. కొన్ని చోట్ల లాస్ లు కూడా వచ్చినప్పటికీ కూడా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అయితే ఇప్పుడు 16 రోజుల్లో కంప్లీట్ చేసుకోగా ఈ వీక్ లో వచ్చిన ఏ సినిమా కూడా కుబేర లాంటి టాక్ ను అయితే…
సొంతం చేసుకోలేక పోవడంతో తిరిగి ఆడియన్స్ కి కుబేర సినిమానే మళ్ళీ ఫస్ట్ ఛాయిస్ అవ్వడంతో వీకెండ్ లో మళ్ళీ జోరు చూపించడం మొదలు పెట్టింది. ఇలానే మరో వారం పాటు కలెక్షన్స్ లిమిటెడ్ గానే అయినా స్టడీగా కొనసాగిస్తే కొద్ది వరకు లాభాలను…
ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ లాస్ లను కవర్ చేసి మరీ కుబేర తెలుగు వర్షన్ మాస్ రచ్చ చేసి ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం విశేషం అనే చెప్పాలి.