బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ మొత్తాన్ని వీకెండ్ కే రికవరీ చేసి తర్వాత మంచి లాభాలతో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ మూడో వీకెండ్ లో ఎంటర్ అవ్వగా అన్ని చోట్లా మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించడం మొదలు పెట్టింది ఇప్పుడు…
ఓవరాల్ గా 16వ రోజున 12 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా గ్రోత్ ని దక్కించుకుంది. 15వ రోజు మీద ఆల్ మోస్ట్ 18 లక్షల రేంజ్ లో గ్రోత్ ని చూపించి 43 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న ఈ సినిమా…
వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 47 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా 90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని 16వ రోజున ఓవరాల్ గా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించింది ఇప్పుడు. ఇక టోటల్ గా సినిమా 16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Sree Vishnu Single Movie 16 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 5.51Cr~
👉Ceeded: 1.45Cr
👉Andhra: 5.75Cr~
AP-TG Total:- 12.71CR(23.35CR~ Gross)
👉KA+ROI+OS : 3.66CR****approx
Total WW Collections: 16.37CR(Gross – 31.25CR~)
7 కోట్ల టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 9.37 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ నుండి ఇప్పుడు ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు పరుగులు పెడుతూ ఉండగా ఈ రోజు కూడా సినిమా సండే అడ్వాంటేజ్ తో జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.