బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను పూర్తీ చేసుకున్న తర్వాత మూడో వారంలో అడుగు పెట్టిన బంగార్రాజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో థర్డ్ వేవ్ ఇంపాక్ట్ వలన జనాలు మరీ అనుకున్న రేంజ్ లో అయితే థియేటర్స్ కి రావడం లేదు, చూడాల్సిన వాళ్ళు ఆల్ రెడీ సినిమాను చూసి ఉండటం తో కొత్త ఆడియన్స్ థియేటర్స్ కి చాలా తక్కువగా వస్తూ ఉండగా సినిమా 15 వ రోజు తో పోల్చితే…
16 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కొద్ది వరకు గ్రోత్ ని శనివారం అవ్వడంతో చూపెట్టింది. 15 వ రోజు 14 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు 16 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 25% వరకు గ్రోత్ ని చూపెట్టగా…
కొన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా బాగానే ఉండటం తో మొత్తం మీద ఈ రోజు సినిమా 18-20 లక్షల రేంజ్ వసూళ్లు సొంతం చేసుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ గ్రోత్ కొంచం ఎక్కువగా ఉంటే 22-24 లక్షల రేంజ్ లో ఉండొచ్చు… అంతకు మించి వసూళ్లు వస్తే సినిమా బాగానే గ్రోత్ ని చూపెట్టింది అని చెప్పొచ్చు.