మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారం లో అడుగు పెట్టగా వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ కోసం చాలా కష్టాలే పడుతుంది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని అందుకుంటున్నా మిగిలిన చోట్ల కలెక్షన్స్ ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేశాయి. చాలా ఏరియాల్లో ఇది వీకెండ్ అవ్వడం తో కొత్త సినిమాల కోసం సైరా థియేటర్స్ ని మరింత తగ్గించారు.
దాంతో ఆ ఇంపాక్ట్ కూడా కలెక్షన్స్ పై మరింత ఎఫెక్టివ్ గా పడుతుంది, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 16 వ రోజు విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సినిమా డ్రాప్స్ ల పర్వం కొనసాగుతుంది, తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ కి ఆల్ మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చిన సైరా…
మరి కొన్ని రోజులు హోల్డ్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ పూర్తీ అవుతుంది, కానీ వర్కింగ్ డేస్ లో సినిమా డ్రాప్స్ కలవర పెడుతున్నాయి. సినిమా 16 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 15 వ రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 35% కి పైగానే డ్రాప్స్ ని సొంతం చేసుకుంది.
ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా మరీ అంత గ్రోత్ కనిపించ లేదు, దాంతో మొత్తం మీద ఇప్పుడు సినిమా 16 వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని సమాచారం. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ గ్రోత్ బాగుంటే….
40 లక్షల చేరువగా వెళ్ళే అవకాశం ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 16 వ రోజున 45 లక్షల లోపు షేర్ ని వసూల్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి. కానీ తెలుగు వర్షన్ వరకు కలెక్షన్స్ పర్వాలేదు అని చెప్పొచ్చు.