బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపెసిన నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లో కొత్త బెంచ్ మార్క్ ని అయితే అందుకుంది కానీ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకొంచం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సినిమా 15వ రోజున సండే అడ్వాంటేజ్ తో మంచి జోరుని చూపించిన తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టింది ఇప్పుడు…ఇక వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా…
ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 20 లక్షల రేంజ్ కి అటూ ఇటూగానే షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి..
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో పెద్దగా జోరు చూపించ లేక పోతున్న సినిమా తెలుగు రాష్ట్రాల ఆవల షేర్ పెద్దగా ఉండే అవకాశం అయితే ఇప్పుడు కనిపించడం లేదు…హిందీ లో కూడా కలెక్షన్స్ చాలా లిమిటెడ్ గానే రిపోర్ట్ అవుతూ ఉండగా…
అక్కడ ఏమైనా కలెక్షన్స్ యాడ్ అయితే ఓవరాల్ గా 16వ రోజున సినిమా 25 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 16 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.