బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల మార్క్ ని అందుకోవడం ఇప్పటికీ కొందరికీ కష్టమే అయినా కానీ బిగ్ స్టార్ మూవీస్ కి హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల మార్క్ ని అందుకోవడం కొందరికీ చెల్లుతుంది. ఇలాంటి రికార్డ్ ను ఇప్పుడు సొంతం చేసుకున్న హీరోల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన మూవీస్ మిగిలిన హీరోలను…
మించి పోయి ఏకంగా 16 సినిమాలు 100 కోట్ల మార్క్ ని అందుకుని ఇండియన్ హీరోల్లో ఆల్ టైం హైయెస్ట్ నంబర్ ఆఫ్ 100 క్రోర్స్ మూవీస్ హీరోగా సంచలన రికార్డ్ ను నమోదు అయ్యేలా చేశాయి ఇప్పుడు. ఒకసారి సల్మాన్ ఖాన్ నటించిన 100 కోట్ల మూవీస్ ని గమనిస్తే…
దబంగ్, రెడీ, బాడీగార్డ్, ఏక్ థా టైగర్, దబంగ్2, జై హో, కిక్, భజరంగీ భాయిజాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, సుల్తాన్, ట్యూబ్ లైట్, టైగర్ జిందా హై, రేస్ 3, భారత్, దబంగ్ 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన…
సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్ కిసి కి జాన్ మూవీ 16 వ 100 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచి సంచలనం సృష్టించింది. ఇక్కడ బిగ్గెస్ట్ రికార్డ్ ఏంటి అంటే ఇవన్నీ కూడా సోలో హీరోగా సల్మాన్ ఖాన్ నటించిన వరుస సినిమాలు అన్నీ ఇప్పుడు 100 కోట్ల మార్క్ ని అందుకోవడం బిగ్గెస్ట్ మాస్ రికార్డ్ అని చెప్పాలి. ఈ రికార్డ్ ను ఫ్యూచర్ లో కూడా అందుకోవడం కష్టమే అని చెప్పాలి.