Home న్యూస్ 17 రోజుల్లో 198 కోట్లు…ఏం సినిమా రా బాబు ఇది!

17 రోజుల్లో 198 కోట్లు…ఏం సినిమా రా బాబు ఇది!

197
0

 కన్నడ సెన్సేషనల్ మూవీ KGF బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ లో కూడా జోరు చూపింది. సినిమా అన్ని ఏరియాల్లో అల్టిమేట్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. రెండు వారాలు ముగిసే సమయానికి చారిత్రిక 175 కోట్ల రేంజ్ గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని చరిత్ర కెక్కిన ఈ సినిమా కన్నడ సినిమా లలో మరే సినిమా కూడా సాధించని చరిత్ర ని సొంతం చేసుకోగా…

ఇప్పుడు 17 రోజులు ముగిసే సరికి మరో చారిత్రిక రికార్డ్ వైపు అడుగులు వేస్తూ దూసుకు పోతుంది, సినిమా 17 రోజుల్లో కర్ణాటక లో 116 కోట్లు, రెండు రాష్ట్రాలలో 20 కోట్లు, హిందీ వర్షన్ 46 కోట్లు, తమిళ్ లో 7.5 కోట్లు, కేరళలో 2.5 కోట్ల గ్రాస్ ని అందుకుంది,

KGF 2 Weeks( 14 Days ) Total Worldwide Collections--Double Blockbuster

ఇక ఓవర్సీస్ లో 6 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 198 కోట్ల గ్రాస్ ని అందుకుని సంచలనం సృష్టించే రేంజ్ లో 100 కోట్లకు పైగా షేర్ ని సాధించి కన్నడ సినీ హిస్టరీలో 100 కోట్ల షేర్ ని అందుకున్న సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ సూపర్ స్ట్రాంగ్ గా సాగుతున్న సినిమా జోరు చూస్తుంటే 230 కోట్ల రేంజ్ గ్రాస్ పక్కా గా సాధిస్తుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here