కోవిడ్ తర్వాత వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అయిన బాలీవుడ్ కి ఈ ఇయర్ కొన్ని పెద్ద సినిమాలు ఊహకందని విజయాన్ని నమోదు చేయడంతో తిరిగి సాలిడ్ గా తేరుకుంది అని అందరూ అనుకున్నారు, కానీ అది కొన్ని సినిమాలకే పరిమితం అవ్వగా మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ ఇప్పుడు బాలీవుడ్ ను సతమతం చేస్తున్నాయి.
లేటెస్ట్ గా బాలీవుడ్ లో భారీ బడ్జెట్తో తెరకెక్కిన టైగర్ ష్రాఫ్(Tiger Shroff) నటించిన లేటెస్ట్ మూవీ గణపత్(Ganapath) మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కి రిలీజ్ అయింది. ఆల్ మోస్ట్ 170 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా ని తెరకెక్కించగా సినిమా సినిమాను భారీ లెవల్ లోనే రిలీజ్ చేశారు.
కానీ సినిమాకి ఆడియన్స్ నుండి భారీగా మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం చేసుకోగా సినిమా ఓపెనింగ్స్ పరంగా ఏమాత్రం హోల్డ్ ని చూపించలేక పోయింది. సినిమా మొత్తం మీద 5 రోజులు పూర్తి అయ్యే టైంకి హిందీలో కేవలం 9.50 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది.
వరల్డ్ వైడ్ గా సినిమా కేవలం 13.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని మాత్రమే సొంతం చేసుకుని అత్యంత దారుణమైన వసూళ్ళతో బాలీవుడ్ కి షాకిచ్చింది ఈ సినిమా…. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక తేరుకునే అవకాశం కూడా లేదనే అంటున్నారు ఇప్పుడు…
ఇలాంటి రిజల్ట్ తర్వాత ఇక సినిమా కి సీక్వెల్ ని అనౌన్స్ చేయగా అది ఉంటుందో ఉండదో అన్న డౌట్స్ నెలకొన్నాయి ఇప్పుడు. ఓవరాల్ గా సినిమా బడ్జెట్ దృశ్యా చూసుకుంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటిగా ఈ సినిమా ఒకటిగా నిలవబోతుంది అని చెప్పాలి ఇప్పుడు.