మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ మొదటి వారంలో దుమ్ము దుమారం లేపిన తర్వాత రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా 8వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉంది. సినిమా మొత్తం మీద 7 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 165 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది.
ఇక సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా 5.6 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది.
ఈ కలెక్షన్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 134 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా సినిమా 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 171 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.
అన్ని చోట్లా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం కొద్ది వరకు ఉండగా మొత్తం మీద సినిమా ఈ వీకెండ్ లో సాధించే కలెక్షన్స్ తో ప్రాఫిట్ ను ఇంకా సాలిడ్ గా పెంచుకునే అవకాశం ఉంది. ఇక 8 రోజుల్లో సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.