రిమార్కబుల్ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి మాస్ ఊచకోత కోసింది…. మ్యాడ్(Mad Movie) కి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) సినిమా… తొలిరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా..
పోటి లో ఇతర సినిమాలు ఉన్నప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ లో కూడా మ్యాడ్2 మూవీ నే ఫస్ట్ ఛాయిస్ గా మారడంతో కలెక్షన్స్ పరంగా ఎక్స్ పెర్టేషన్స్ అన్నీ కూడా మించి పోయింది మ్యాడ్2 సినిమా.. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా మొదటి రోజున సినిమా…
9-9.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా… రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1.2 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ కన్ఫాం గా కనిపిస్తూ ఉండగా…ఇక ఓవర్సీస్ లో ఎక్స్ పెర్టేషన్స్ ని మించిపోయిన సినిమా…
నార్త్ అమెరికాలోనే $650K డాలర్స్ మార్క్ ని దాటేసి కుమ్మేసింది. ఇక మిగిలిన చోట్ల కలెక్షన్స్ పరంగా మాస్ కుమ్ముడు కుమ్మేసిన సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు మినిమమ్ 16-17 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక అంచనాలను మించి పోతే ఈ అంచనాలను కూడా మించి పోయే ఓపెనింగ్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. సినిమా ఊపు చూస్తుంటే లాంగ్ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ ని నమోదు చేసే అవకాశం ఉంది.