ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో కొత్త సినిమాలు ఏవి కూడా అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ని ఏమి చూపించక పోవడంతో ఆడియన్స్ కి తిరిగి యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ మొదటి ఆప్షన్ గా మారగా సినిమా ఈ అడ్వాంటేజ్ ను…
బాగానే వాడుకుని వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని లాభాలను పెంచుకుని ఇప్పుడు ఏకంగా 17 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 32 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది….సినిమా 17వ రోజున…
తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 45 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 90 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 17 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి..
వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Sree Vishnu Single Movie 17 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 5.70Cr~
👉Ceeded: 1.49Cr
👉Andhra: 5.92Cr~
AP-TG Total:- 13.11CR(24.10CR~ Gross)
👉KA+ROI+OS : 3.71CR****approx
Total WW Collections: 16.82CR(Gross – 32.15CR~)
మొత్తం మీద 7 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 9.82 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ నుండి ఇప్పుడు ట్రిపుల్ బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడుతుంది.