బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను సాలిడ్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడో వారంలో ఎంటర్ అయిన నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ, వీకెండ్ వచ్చేయడంతో మళ్ళీ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16 వ రోజు కూడా మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది. కేవలం 3 లక్షలు మాత్రమే డ్రాప్ అయిన సినిమా…
ఇప్పుడు 17 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ అడ్వాంటేజ్ అండ్ కొన్ని ఎక్స్ ట్రా థియేటర్స్ కూడా యాడ్ అవ్వడంతో మార్నింగ్ షోల టైం కి కేవలం 5% డ్రాప్ అవ్వగా మ్యాట్నీ షోల నుండి గ్రోత్ చూపెట్టడం స్టార్ట్ చేయగా ఈవినింగ్ షోలకు హౌస్ ఫుల్ బోర్డులు…
చాలా చోట్ల కనిపించడం విశేషం. దాంతో ఈ రోజు సినిమా ఓవరాల్ గా 15-20% గ్రోత్ ని చూపెట్టే అవకాశం ఉండగా సినిమా 17 వ రోజు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 35 నుండి 40 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు. అంతకి మించి ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది సినిమా కి. మరి అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.