Home న్యూస్ 17th DAY కల్కి కలెక్షన్స్…ఈ రోజు మాస్ రాంపెజ్!!

17th DAY కల్కి కలెక్షన్స్…ఈ రోజు మాస్ రాంపెజ్!!

0
Kalki 2898 AD 17th Day Box Office Collections Update
Kalki 2898 AD 17th Day Box Office Collections Update

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ మూడో వీక్ లో అడుగు పెట్టి అన్ని చోట్లా భారీగా థియేటర్స్ ని హోల్డ్ చేయగా కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా అన్ని చోట్లా అద్బుతమైన కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపెడుతున్న సినిమా ఇప్పుడు…

17వ రోజున శనివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో హిందీ లో మాత్రం సినిమా రెట్టించిన జోరు చూపెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా తెలుగు రాష్ట్రాల్లో 50-60% రేంజ్ లో గ్రోత్ ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో ఉండగా…

ఆఫ్ లైన్ లో కూడా ఇదే రేంజ్ లో జోరు కొనసాగితే సినిమా మొత్తం మీద 17వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.6-1.8 కోట్ల రేంజ్ కి పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక హిందీ లో సినిమా 17వ రోజు ఫుల్ జోష్ ని…

చూపెడుతూ ఉండటంతో సినిమా హిందీలో 6-6.5 కోట్ల నుండి ఆ పైన నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది, ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఓవరాల్ గా 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో మరోసారి కుమ్మేసిన సినిమా…

ఓవరాల్ గా 17వ రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 17 రోజులకు గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here