రెండు వారాల్లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush)ల కాంబో మూవీ కుబేర(Kuberaa Movie) సినిమా, మూడో వీకెండ్ లో కూడా స్టడీ హోల్డ్ ని చూపెడుతూ ఇప్పుడు కొత్త సినిమాల కన్నా కూడా బెటర్ ట్రెండ్ ను చూపెడుతూ టికెట్ సేల్స్ లో…
రాంపెజ్ ను చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయిస్ గా సినిమా నిలుస్తూ ఉండగా 16వ రోజుతో పోల్చితే సినిమా 17వ రోజున మరోసారి మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే…
సినిమా 20-25% రేంజ్ లో గ్రోత్ ని చూపెడుతూ ఉండగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా బాగుండటంతో ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 50-55 లక్షల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే…
ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా ఓవర్సీస్ లో కూడా డీసెంట్ ట్రెండ్ ను ఇప్పుడు చూపెడుతూ ఉంది…
దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా 80-85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ లెక్క మరికొంత పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా 17 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.