బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి రోజు వచ్చిన మిక్సుడ్ టాక్ కి లాంగ్ రన్ ఎలా ఉంటుందో అన్న అనుమానాలు ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ మూడో వీకెండ్ లో అల్టిమేట్ హోల్డ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపిన అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప ఇప్పుడు 18 వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ ను ఫేస్ చేయాల్సి రాగా…
ఈ సారి డ్రాప్స్ కొంచం అనుకున్న దానికన్నా ఎక్కువగానే సొంతం అయ్యాయి అని చెప్పాలి. సినిమా 50-55% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ ఏకంగా 70% కి పైగా డ్రాప్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర 18 వ రోజు సొంతం చేసుకుంది ఈ సినిమా.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 18 వ రోజు మొత్తం మీద 33 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా 17 వ రోజు తో పోల్చితే 1.79 కోట్ల దాకా డ్రాప్ అయింది. హిందీలో 2.5 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సాధించగా, ఓవర్సీస్ కలెక్షన్స్ అండ్ గ్రాస్ అప్ డేట్ అయ్యాయి…వాటితో సినిమా…
ఓవరాల్ 18 డేస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 40.23Cr(Without GST 37.02Cr)
👉Ceeded: 14.78Cr
👉UA: 7.93Cr
👉East: 4.78Cr
👉West: 3.90Cr
👉Guntur: 5.00Cr
👉Krishna: 4.13Cr
👉Nellore: 3.05Cr
AP-TG Total:- 83.80CR(130.50CR~ Gross)
👉Karnataka: 11.22Cr
👉Tamilnadu: 10.43Cr
👉Kerala: 5.23Cr
👉Hindi: 31Cr
👉ROI: 2.20Cr
👉OS – 14.15Cr(updated)
Total WW: 158.03CR(298CR~ Gross)(Gross Corrected)
ఇదీ సినిమా 18 రోజుల కలెక్షన్స్ లెక్క.
మొత్తం మీద సెన్సేషనల్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుని 146 కోట్ల టార్గెట్ మీద ఆల్ మోస్ట్ 12 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపిన పుష్ప ఇప్పుడు లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుంది అన్నది ఆసక్తికరం అని చెప్పాలి. త్వరలోనే 160 కోట్ల షేర్ మార్క్ ని సినిమా సొంతం చేసుకోబోతుంది.