బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అయిన కరణ్ జోహార్(Karan Johar) చాలా గ్యాప్ తర్వాత తన డైరెక్షన్ లో రణవీర్ సింగ్(Ranveer Singh) ఆలియా భట్(Alia Bhatt) ల కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న భారీ ఫ్యామిలీ మూవీ రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Kii Prem Kahaani) సినిమా…
ఈ నెల 28న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా బాలీవుడ్ లో భారీ లెవల్ లో రూపొందుతున్న సినిమాలలో ఒకటి. ఫ్యామిలీ మూవీ అయినా కూడా ఆల్ మోస్ట్ 180 కోట్ల రేంజ్ లో భారీ బడ్జెట్ తో కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తూ అలాగే తెరకేక్కిస్తూ ఉండగా…
సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత కథను చాలా సౌత్ మూవీస్ లో చూసినట్లుగానే అనిపించగా మేజర్ గా 1999 లో వచ్చిన జోడి(JODI) స్టోరీ పాయింట్ ని చిన్న మార్పులతో చెప్పారు అనిపించేలా ఉందని చెప్పాలి..
హీరో హీరోయిన్స్ ఇద్దరూ వేరు వేరు ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుండి రాగా ఇద్దరూ ప్రేమించుకున్న తర్వాత ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవడంతో ఒకరి ఫ్యామిలీ లో ఒకరు మూడు నెలలు గడిపి ఫ్యామిలీస్ ని ఒప్పించే పనిలో ఉంటారు…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా స్టొరీ పాయింట్…
ఆల్ మోస్ట్ 1999 లో వచ్చిన జోడి సినిమానే మాడ్రనైజ్ చేసి చెబుతూనే అనేక సౌత్ ఫ్యామిలీ మూవీస్ ని తీసుకుని ఈ సినిమాను 180 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందిస్తున్నారు అనిపించేలా ఉంది ఈ సినిమా ట్రైలర్. కానీ ట్రైలర్ ప్రామిసింగ్ గానే ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.