Home న్యూస్ 186 కోట్లు……ఒక్క దెబ్బతో ఇండియా షేక్!!

186 కోట్లు……ఒక్క దెబ్బతో ఇండియా షేక్!!

2

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ ఏడాది చాలా పెద్ద చిన్న సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి….ఆ సినిమాల ప్రమోషన్స్ కోసం కావచ్చు లేక…మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది అని చెప్పుకోవడానికి కావొచ్చు సినిమాల కలెక్షన్స్ ని పోస్టర్స్ లో అఫీషియల్ గా రిలీజ్ చేస్తూ ఉంటారు. కొన్ని సినిమాలు వచ్చిన కలెక్షన్స్ కన్నా అప్పుడప్పుడు మిస్టేక్ లో తక్కువ కలెక్షన్స్ చెబితే..

చాలా వరకు సినిమాల ట్రాక్ చేసిన ట్రేడ్ లెక్కల కన్నా కూడా పోస్టర్స్ లో కలెక్షన్స్ కొంచం ఎక్కువగా చూపించడం అన్నది దాదాపు అన్ని సినిమాలకు జరిగేదే….ఇది చాలా వరకు నార్మల్ ఆడియన్స్ కి తెలియదు..పోస్టర్ లో కలెక్షన్స్ ని చూసి…ఈ రేంజ్ లో వసూళ్లు వచ్చాయా…అయితే సినిమా చూసేయాలి అని ఎగబడి థియేటర్స్ కి వెళతారు….

పోస్టర్ కలెక్షన్స్ పబ్లిసిటీ కోసమే వేస్తాం అంటూ నిర్మాతలు అనేక సార్లు ఓపెన్ గా స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చారు….దాదాపు ప్రతీ సినిమా విషయంలో ట్రేడ్ లెక్కల కలెక్షన్స్ అఫీషియల్ పోస్టర్ ల మధ్య తేడా 10-20% రేంజ్ లో ఉంటుంది….కొన్ని సార్లు ఇది కొంచం పెరగవచ్చు కూడా….

కానీ అప్పుడప్పుడు కొన్ని సినిమాల కలెక్షన్స్ పోస్టర్ లు అందరినీ ఆశ్యర్యపరుస్తాయి…ఇప్పుడు 2025 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల గేమ్ చేంజర్(Game Changer) సినిమా విషయంలో ఇదే జరిగింది…. సినిమా ట్రేడ్ లెక్కల ప్రకారం…

ట్రాక్ చేసిన గ్రాస్ లెక్కలు మొదటి రోజు కి గాను ఓవరాల్ గా 80-85 కోట్ల దాకా ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 90-100 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది… మిక్సుడ్ టాక్ తో కూడా ఇది మంచి ఓపెనింగ్స్ అనే చెప్పాలి… కానీ నిర్మాతలు రిలీజ్ చేసిన ఒక్క పోస్టర్ ఇప్పుడు ఇండియా మొత్తాన్ని షేక్ చేసింది…

సోషల్ మీడియాలో సినిమాల కలెక్షన్స్ గురించి అవగాహన ఉన్న వాళ్ళందరూ ఈ పోస్టర్ చూసి ముక్కున వేలు వేసుకునే పరిస్థితి వచ్చింది….తొలిరోజు ఏకంగా 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్….. ట్రేడ్ లెక్కలకు నిర్మాతల లెక్కలకు మధ్య తేడా….

చాలా చాలా ఎక్కువగా ఉండటంతో అసలు పోస్టర్ లో ఈ రేంజ్ లో వసూళ్ళని ఎలా వేశారు అని అందరూ అనుకుంటున్నారు….ఇండియా వైడ్ గా ఓ రేంజ్ లో ట్రోల్ స్టఫ్ అయింది గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్…తన సినిమాలకు కలెక్షన్స్ పోస్టర్ లు వేయను అని ఒక సందర్బంలో రామ్ చరణ్ స్వయంగా చెప్పగా…

ఇప్పుడు ఈ పోస్టర్ ఎలా రిలీజ్ చేశారు అంటూ ఒక టైప్ లో ట్రోల్స్ పడుతూ ఉండగా మరో పక్క ఇతర సినిమాలతో కంపేర్ చేస్తూ బుకింగ్స్ కానీ ఆక్యుపెన్సీ కానీ….టికెట్ సేల్స్ కానీ కంపేర్ చేస్తూ అంత మొత్తం ఎక్కడ నుండి వచ్చింది అంటూ ఓ రేంజ్ లో ట్రోల్స్ పడుతున్నాయి…మరి ఈ ట్రోల్స్ ఎక్కడి దాకా వెలతాయో చూడాలి….

Ram Charan Game Changer Total WW Pre Release Business

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here