సినిమా కి హైప్ రావడం కోసం అప్పుడప్పుడు పబ్లిసిటీ విషయంలో ఎత్తులకి పై ఎత్తులు వేయడం అన్నది కామన్ గా జరుగుతూ ఉంటుంది. సినిమాలో హైలెట్ అనుకున్న సీన్స్ సాంగ్స్ లో ఉంటే వాటిని ట్రైలర్ లో పెట్టి ఈ షాట్స్ అదిరిపోయాయి అంటూ థియేటర్స్ కి వెళితే ఆ షాట్స్ సాంగ్స్ లో ఉండటం చూసి నీరుగారిపోయిన వాళ్ళు ఎంతో మంది… కానీ సినిమా కి హైప్ ని పెంచడానికి…
ఇన్ని చోట్ల ఆఫర్స్ వచ్చాయి లాంటి స్టేట్ మెంట్స్ ని, అల్టిమేట్ బిజినెస్ చేసింది అంటూ కూడా చెప్పిన సందర్బాలు అనేకం ఉన్నాయి. అలాగే సినిమా బడ్జెట్ ఒకటి అయితే మార్కెటింగ్ కోసం చెప్పిన బడ్జెట్ ఒకటి చెప్పడం లాంటివి కూడా అనేక సందర్బాలలో జరిగాయి కానీ…
ఎవ్వరూ కూడా ఓపెన్ గా వీటిని ఒప్పుకోరు, కానీ రీసెంట్ గా ఇలాంటి విషయాన్ని ఒకటి ఓపెన్ గా ఒప్పుకుని అసలు నిజం చెప్పాడు డైరెక్టర్… 2010 టైం లో భారీ హైప్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో కార్తీ నటించిన యుగానికి ఒక్కడు సినిమా కూడా ఒకటి. ఆ సినిమా తమిళ్ లో ముందు ఫ్లాఫ్ కానీ టెలివిజన్ లో…
సూపర్ డూపర్ హిట్, తెలుగు లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళని సొంతం చేసుకుంది. ఈ సినిమా కి మొత్తం మీద అయిన బడ్జెట్ 18 కోట్ల రేంజ్ లో ఆ టైం లో కొత్త హీరో పై వన్ ఆఫ్ ది హైయెస్ట్ అని అంటూ పబ్లిసిటీ కోసం సినిమా ను ఏకంగా 32 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కించామని చెప్పారు.
ఈ విషయాన్నీ స్వయంగా డైరెక్టర్ సెల్వరాఘవన్ రీసెంట్ గా కోలివుడ్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమా ఓవరాల్ గా ఒరిజినల్ బడ్జెట్ కన్నా ఎక్కువ వసూళ్ళని తమిళ్ తెలుగు లో కలిపి సొంతం చేసుకుందని, కానీ బడ్జెట్ ఎక్కువ అని చెప్పడంతో కాస్ట్ ఫెల్యూర్ గా చెప్పారని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు సీక్వెల్ విషయంలో మాత్రం ఊహకందని బడ్జెట్ తో భారీ ఎత్తున తీస్తామని చెప్పారు ఈ డైరెక్టర్.