Home న్యూస్ 18పేజెస్ రివ్యూ….రేటింగ్!!

18పేజెస్ రివ్యూ….రేటింగ్!!

0

ఈ ఇయర్ కార్తికేయ2 సినిమాతో ఆడియన్స్ ను మెప్పించి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ 18 పేజెస్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది, సుకుమార్ అందించిన కథతో కుమారి 21F డైరెక్టర్ సూర్య ప్రతాప్ తీసిన ఈ సినిమా పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ట్రైలర్ కూడా పర్వాలేదు అనిపించగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా కథ పాయింట్ కి వస్తే…

యాప్ డెవలపర్ అయిన హీరో లవ్ ఫేల్యూర్ అయి ఉన్న టైంలో తనకి ఒక డైరీ దొరుకుతుంది, ఆ డైరీ అనుపమ పరమేశ్వర్ రాసుకున్న డైరీ. టెక్నాలజీకి దూరంగా ఉండే హీరోయిన్ తన లైఫ్ లో జరిగే ఇంసిడెంట్ లను డైరీ లో రాసుకుంటుంది, ఆ డైరీలో 18 పేజెస్ ఉండగా హీరో ఆ డైరీలో ఇన్వాల్వ్ అయిపోయి తెలియకుండానే హీరోయిన్ తో కనెక్ట్ అవుతాడు, కానీ తర్వాత డైరీలో పేజెస్ లేక పోవడం హీరోయిన్ గురించి హీరోకి ఎలాంటి నిజాలు తెలిశాయి అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

ఓవరాల్ గా సినిమా స్టొరీ పాయింట్ చాలా యూనిక్ అండ్ డిఫెరెంట్ గా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు, కానీ ఒక దశ వరకు బాగున్నా తర్వాత కథ స్లోగా సాగడం, కొంత కన్ఫ్యూజన్ ని కూడా క్రియేట్ చేయడంతో మిక్సుడ్ ఫీలింగ్స్ కలిగిస్తుంది ఈ సినిమా… నిఖిల్ మరోసారి తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించగా అనుపమ కూడా అద్బుతంగా నటించింది. మిగిలిన నటీనటులు కూడా మెప్పించారు…

సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి, సినిమా ఫీల్ కి తగ్గట్లు మెప్పించగా, స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు బాగున్నా సెకెండ్ ఆఫ్ ట్రాక్ తప్పుతుంది, డైరెక్టర్ మంచి పాయింట్ నే ఎంచుకున్నా పూర్తీగా సఫలం అవ్వలేదు అలా అని పూర్తిగా నిరాశ కూడా పరచలేదు, సంగీతం, ఫస్టాఫ్ బాగుండటం, స్టొరీ పాయింట్ కొత్తగా ఉండటం, ఎమోషన్స్ కొన్ని చోట్ల ఆకట్టుకోవడం లాంటివి బాగానే ఇంప్రెస్ చేశాయి… అదే టైం లో…

సెకెండ్ ఆఫ్ లో కొంత భాగం ట్రాక్ తప్పడం, స్క్రీన్ ప్లే కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయడం, స్లో నరేషన్ లాంటివి మైనస్ లు గా నిలిచినా కానీ కొత్త కథలు కోరుకునే వారు, రొటీన్ మూవీస్ చూసి చూసి బోర్ ఫీల్ అయ్యే వాళ్ళు కొంచం ఓపిక చేసుకుని చూస్తె 18 పేజెస్ ఒకసారి ఈజీగా చూసే విధంగా ఉందని చెప్పాలి. ఇంకొంచం కేర్ తీసుకుని ఉంటే సినిమా బాగుండేది… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here