బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ 2 సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు యంగ్ హీరో నిఖిల్, అందులో ఒక సినిమా పాన్ ఇండియా లెవల్ లో రచ్చ చేసి ఊహించని బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. మరో సినిమా అనుకున్న రేంజ్ లో టాక్ రాకపోయినా ఉన్నంతలో బాగానే పెర్ఫార్మ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. ఆ సినిమానే నిఖిల్ నటించిన 18 పేజెస్ మూవీ..
ఈ సినిమా కార్తికేయ2 లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాగా 121 కోట్ల రేంజ్ లో వసూళ్లు సాధించిన బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమానే అయినా ఎక్స్ పెరిమెంటల్ స్టొరీ అవ్వడంతో మరీ భారీ వసూళ్లు సాధించలేదు కానీ ఉన్నంతలో హిట్ గీతని అయితే దాటింది…
ఒక సారి సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 5.15Cr
👉Ceeded: 1.00Cr
👉UA: 1.09Cr
👉East: 65L
👉West: 37L
👉Guntur: 50L
👉Krishna: 43L
👉Nellore: 25L
Total AP TG:- 9.44CR(18.00~ Gross)
👉KA+ROI – 76L
👉OS – 1.63Cr
👉WW Collections– 11.83CR(23.50~Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క…
మొత్తం మీద సినిమా 11 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి 83 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను అయితే సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది, కానీ 121 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకున్న కార్తికేయ2 తర్వాత ఈ సినిమా పై ఇంకా ఎక్కువ వసూళ్లు సాధిస్తుంది అన్న అంచనాలు ఉన్నా ఉన్నంతలో జస్ట్ హిట్ తో సరిపెట్టుకుంది ఈ సినిమా.